Sunday, July 23, 2006

sify telugu

visit sify telugu

http://sify.com/telugu

Friday, January 27, 2006

'రత్నా'ల మాలకు అర్హులే లేరా?

తవ అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు దక్కడంతో తెలుగు వారు గర్వంతో ఊగిపోవచ్చుగాక!. నేను మాత్రం ఓ భారతీయుడిగా ఈ పద్మ అవార్డుల జాబితాతో చాలా షాక్‌కు గురైయ్యాను. గత ఏడాది దేశ తొలి అత్యున్నత పురష్కారం 'భారతరత్న'కు ఎవరూ ఎన్నికకాలేదు. ఈ ఏడాది కూడా ఎవరూ ఎంపికకాలేదన్న వార్త విని చాలా షాక్‌కు గురైయ్యా. వంద కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో 'భారతరత్న'కు అర్హులే లేరా?..ఎంత దారుణం. సాంకేతికంగా కేంద్ర ప్రభుత్వం భారతరత్నకు ఎవరినీ ఎంపిక చేయకపోవడానికి ఎన్ని కారణాలు చెప్పినా..నాకు మాత్రం ఏవగింపుగానే ఉంది.



రెండో హరిత విప్లవానికి సిద్ధమవుతున్నట్టు చెప్పుకుంటున్నా 40 ఏళ్ల క్రితం నాటి తొలి హరిత విప్ల వ వీరులను ఎప్పుడో మరచిపోయినట్టు ఉంది. తొలి హరిత విప్లవ పితామహుడుగా పేరుగాంచి డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్‌కు ఈ ఏడాది భారతరత్న అవార్డు ఓ వ్యక్తికి దక్కవచ్చని నేను ఆతృతగా ఎదురుచూశా. దేశ విదేశాలకు చెందిన మొత్తం 46 విశ్వవిద్యాలయాలు ఆయన్ను గౌరవ డాక్టరేటుతో సత్కరించాయి. టైమ్ మెగజైన్ 20 శతాబ్ధపు ప్రతిభావంతులైన అసియా వ్యక్తుల జాబితాలో ముగ్గరు భారతీయులకు చోటిచ్చింది. అందులో మహాత్మాగాంధి, రవీంద్ర నాథ్ టాగూర్‌లతో పాటుగా ఎమ్మెస్ స్వామినేథన్ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి నుంచి తొలి వరల్డ్ ఫుడ్ అవార్డుతో సహా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు, రామన్ మెగసేసి అవార్డు తదితరాలకు ఆయన ఎంపికయ్యారు. అలాంటి వ్యక్తికి 'భారతరత్న' అందని ద్రాక్షగానే ఉంది.



ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. సినీ రంగంలో విశిష్ట సేవలందించినందుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎవ్జీుఆర్‌కు భారతరత్న అవార్డు వరంచింది. అయితే మహానటుడు శివాజీ గణశన్‌కు మాత్రం అది అందని ద్రాక్షే. ఎవ్జీుఆర్, శివాజీ గణశన్‌లలో మేటి శివాజీయేనని ఎవడైనా చెప్పగలడు. అయితే ఆ రతనాల మాల ఎవ్జీుఆర్‌ను మాత్రం వరించడానికి...ఆయనకు ఎక్స్‌ట్రా అర్హత ఉంది. అదే రాజకీయాలు. అర్హులను వరిస్తేనే'భారతరత్న'కు వన్నె వస్తుంది..లేకుంటే మట్టిలో మాణిక్యంగానే మిగిలిపోతుంది.

Monday, January 23, 2006

నా తొలి తెలుగు బ్లాగు

తెలుగులో బ్లాగు ప్రారంభించాలన్న నా కల ఎట్టకేలకు నేడు నెరవేరింది.

Saturday, September 11, 2004

My blog

This is my first blog